రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తన భర్త బాగానే ఉన్నాడని.. ఆ తర్వాతే ఏదో జరిగిందని సింగయ్య భార్య లూర్ద్ మేరీ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్‌ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. లూర్ద్ మేరీ తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ యోగ క్షేమాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి.. వైద్యులకు సీఎం విజ్ఞప్తి!
జగన్‌తో భేటీ అనంతరం లూర్ద్ మేరీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగయ్య మృతిపై తమకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు. ప్రమాదంలో చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడని నిలదీశారు. పోలీసులు ఆటోలోకి ఎక్కడానికి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. సింగయ్యను అంబులెన్స్‌లోకి ఎక్కించిన తర్వాత ఏదో చేశారని ఆరోపించారు. లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు.. వాళ్లు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారన్నారు. పోలీసులు ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు మార్చి పెట్టమన్నారని.. కానీ అందుకు అంగీకరించలేదన్నారు. ప్రమాదం తర్వాత కూడా తన భర్త బాగానే ఉన్నాడని.. అక్కడ వాళ్లతో కూడా బాగానే మాట్లాడారని.. ఇంతలోనే ఎలా చనిపోతారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ను కుటుంబ సభ్యులమంతా కలిశామని.. తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని లూర్ద్ మేరీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Dil Raju : నెగెటివ్ ట్రోలింగ్‌కు చెక్.. మంచు విష్ణు మార్గాన్ని ఫాలో అవుతున్న దిల్ రాజు”
