Site icon NTV Telugu

Senior IAS Officers Transferred in AP: ఏపీలో 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీలు..

Ap Govt

Ap Govt

Senior IAS Officers Transferred in AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరుగుతూ వచ్చాయి.. అయితే, ఈ సారి రాష్ట్రంలోని 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Read Also: World Record: వీడు మామూలోడు కాదు భయ్యా.. వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు..!

బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు వీరే..

* టీటీడీ ఈవోగా సింఘాల్‌ బదిలీ అయ్యారు.. గతంలో కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు సింఘాల్..
* ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కృష్ణబాబు బదిలీ
* మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సౌరభ్ గౌర్ బదిలీ
* సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు బదిలీ
* ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా బదిలీ
* కాంతిలాల్ దండే – అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ.
* అనంత రాము – గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ..
* హరిజవహర్ లాల్ – దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ..
* ఎంవీ శేషగిరిబాబు – కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ
* సీహెచ్ శ్రీధర్ – మైనారిటీ శాఖ కార్యదర్శి
* ప్రవీణ్‌కుమార్‌-ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (ఢిల్లీ)గా బదిలీ

Exit mobile version