NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి.. ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది.. అయితే, కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయడం ఇది రెండోసారి..
Read Also: Pakistan Airstrikes: కాబూల్‌పై వైమానిక దాడి.. టీటీపీ చీఫ్ నూర్ లక్ష్యంగా పాక్ దాడి..?
ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్లు..
* గతంలో సీఈవో ఆమోదించిన బిల్లులు 550 కోట్ల రూపాయలు చెల్లించాలి..
* ఈ నెల నుంచి నెలకు రూ.800 కోట్లు చొప్పున బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలి..
* రూ.2,700 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారింది..
* యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి..
* ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి..
* కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్యసేవా స్కీమ్‌లతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలి..
* ఎన్టీఅర్ వైద్యసేవా స్కీమ్ ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయి..
* గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్ గా జరపాలి..
* సీఈవోలను ఎక్కువగా మార్చేయడం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కారణం అవుతోంది..
* యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలి.
* స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తో చర్చించిన తరువాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది..
