Site icon NTV Telugu

Botsa Satyanarayana: ప్రజల కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: పీపీపీ మోడల్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు.. ప్రజల కోసం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం అని పేర్కొన్నారు.. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ దక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసమే మెడికల్ కళాశాలలు ప్రారంభించాం.. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామని బొత్స స్పష్టం చేశారు.

Read Also: Minister BC Janardhan Reddy: ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాలు..!

ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంస్థల సహకారంతో పనులు ప్రారంభించామని.. తమ ప్రభుత్వ హయాంలోనే ఐదు కళాశాలలు పూర్తి అయ్యి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు బొత్స.. ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలకు మేలు చేస్తుందనే భయంతోనే పనులు ఆపివేసినట్టు బొత్స ఆరోపించారు. జగన్‌కు పేరు వస్తుందనే అసూయతో ప్రైవేటీకరణకు రెడీ అయ్యారు అన్నారు. పీపీపీ మోడల్‌పై పాట పాడుతున్నా.. అసలు నియంత్రణ ప్రభుత్వం చేతులకే ఉంటుందంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు.

ఇక, చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన బొత్స.. మీ దగ్గర డబ్బు ఉంది.. అందుకే పేదలకు చదువు అక్కర్లేదా? ఇది ధర్మమా? అని ప్రశ్నించారు.. ఆరోగ్యశ్రీపై తీవ్ర ఆక్షేపణ చేస్తూ.. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని.. ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. “ప్రైవేటు లక్ష్యం లాభం.. ప్రజలు కాదు”.. ప్రభుత్వ వైద్య సేవలు ప్రైవేటుకు అప్పగిస్తే.. పేదలకు చికిత్స మరింత దూరమవుతుందని.. గతంలో వేల కోట్లు ఖర్చు చేసిన ఆరోగ్యశ్రీని ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.. రాజకీయంగా కాదు.. ప్రజల కోసం పోరాటం.. ఇప్పటికే 80 నుండి 90 లక్షల సంతకాలు పూర్తయ్యాయని.. కోటి సంతకాలు సేకరించి.. త్వరలో వైఎస్‌ జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు అందజేస్తామని చెప్పారు. పీపీపీ విధానం వెనక్కు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు అని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ..

Exit mobile version