Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. తొలి యూనిట్లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో రోటర్ బిగింపు పనులకు కూడా శ్రీకారం చుట్టారు. దీంతో తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి మరింత చేరువైంది. గోదావరి పుష్కరాల ప్రారంభం నాటికి తొలి ఆరు యూనిట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన ఎలక్ట్రో-మెకానికల్ పనులు వేగం పుంజుకున్నాయి. తొలి యూనిట్లో స్టాటర్ ఏర్పాటు ప్రారంభించగా.. రోటర్ బిగింపు పనులు కూడా మొదలయ్యాయి. ఏపీ జెన్కో హైడల్ విభాగం డైరెక్టర్ సుజయ్ కుమార్, అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు పనుల పురోగతిని పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రంలో నీటి ప్రవాహంతో టర్బైన్ తిరుగుతుంది. దానికి అనుసంధానమైన రోటర్ కూడా తిరుగుతుండగా.. రోటర్ చుట్టూ ఉండే స్థిర భాగమైన స్టాటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో స్టాటర్ ఏర్పాటు యూనిట్ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశగా అధికారులు చెబుతున్నారు.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 80 మెగావాట్లు కాగా.. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులను సమాంతరంగా కొనసాగిస్తూ.. ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారు. పుష్కరాల ప్రారంభం నాటికి తొలి ఆరు యూనిట్లను అందుబాటులోకి తీసుకురావడమే ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఏపీ జెన్కో అధికారులు సూచించారు. స్టాటర్, రోటర్ వంటి కీలక పరికరాల ఏర్పాటులో అత్యంత కచ్చితత్వంతో పాటు నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
మరోవైపు తొలి యూనిట్లో స్టాటర్, రోటర్ పనులు ప్రారంభం కావడం ప్రాజెక్టు పురోగతిలో ముఖ్యమైన మైలురాయిగా ఎంఈఐఎల్ అధికారులు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగిస్తూ.. తొలి ఆరు యూనిట్లను లక్ష్య సమయానికి సిద్ధం చేసేందుకు ఇంజినీరింగ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మొత్తం 12 యూనిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు, ముఖ్యంగా పీక్ డిమాండ్ సమయంలో ఈ జల విద్యుత్ కేంద్రం కీలకంగా మారనుంది. తొలి యూనిట్లో స్టాటర్, రోటర్ పనులు ప్రారంభం కావడంతో.. పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణం మరో కీలక దశకు చేరుకుంది.
తాజావార్తలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!