Site icon NTV Telugu

Minister Nara Lokesh: విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయండి.. కేంద్రానికి లోకేష్‌ విజ్ఞప్తి..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయండి అంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మంచి SBTET-AP ద్వారా NCVET అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు పాల్గొన్నారు.

Read Also: Urvashi : తిండీ నిద్ర మానేసి రాత్రంతా అదే పని.. నా ఆరోగ్యం నాశనం చేసుకున్నా

Exit mobile version