Site icon NTV Telugu

Minister Narayana: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

Narayana

Narayana

Minister Narayana: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు, వాటి రిజిస్ట్రేషన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. అమరావతి రైతులకు ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారు.. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకొంది.. ల్యాండ్ పూలింగ్ కింద మోట్ 30,635 మంది రైతులకు కేటాయించాల్సి ఉంది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2727 మంది రైతులకు ప్లాట్ ల కేటాయింపు పూర్తయింది.. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు.. రిటర్నబుల్ ప్లాట్ లలో ఇంకా 2501 మందికి 8441 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది.. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ లు పెండింగ్ లో ఉన్నాయి అని తెలిపారు.. రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నాం.. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ లు మొత్తం పూర్తి చేస్తాం అన్నారు.. సాంకేతిక సమస్యలతో 484 మంది రైతులకు 3.15 కోట్ల కౌలు చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉందన్నారు.. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురి చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ..

Read Also: IP66+IP68+IP69 రేటింగ్స్, 50MP ట్రిపుల్ కెమెరా, 7025mAh బ్యాటరీతో OPPO Find X9 లాంచ్..!

Exit mobile version