Whatsapp Governance: ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..

  • ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..
  • ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్..
  • వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదట 161 సేవలు..
Whatsapp Governance

Whatsapp Governance

Whatsapp Governance: ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. ఇక, రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది. దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొస్తోంది.

Read Also: Virat Kohli: 12 ఏళ్ల తర్వాత బరిలోకి.. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే!

ఇక, వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలుకుతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని తెలిపిన విషయం విదితమే..