Site icon NTV Telugu

Minister Nara Lokesh: నా అన్వేషణ అన్వేష్ వీడియోపై స్పందించిన లోకేష్‌.. బెట్టింగ్‌ యాప్‌లపై కఠిన చర్యలు..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: బెట్టింగ్ యాప్స్ మాయలోపడి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు.. ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది.. ఈజీగా మని సంపాదించవచ్చు అనే ఆశతో.. బెట్టింగ్‌ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న యువత.. అప్పుల్లో కూరుకుపోయి.. పేరెంట్స్‌ ఖాతాల్లో ఉన్న సొమ్మును కూడా తగిలేసి.. చివరకు చేసేది ఏమీ లేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు.. అయితే, బెట్టింగ్స్‌ యాప్స్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ప్రమోట్‌ చేశారు.. ప్రమోషన్లతో వారు కోట్లు వెనకేసుకుంటే.. అమాయకులు మాత్రం అప్పులపాలై.. ప్రాణాలు విడుస్తున్నారు.. దీనిపై ‘నా అన్వేషణ’ ఫేం అన్వేష్.. సంచలన విషయాలను బయటపెట్టారు.. బెట్టింగ్ మాఫియా గురించి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మన సెలబ్రిటీలు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో కూడా లెక్కలు బయటపెట్టడంతో.. తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి.. సెలబ్రిటీలకు నోటీసులు.. వారిని ప్రశ్నించడం.. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Chhattisgarh: అసలు వీడు మనిషేనా..? రూ. 200 కోసం తల్లిని దారుణంగా చంపిన కొడుకు..

ఇక, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఏరుతో గోవిందా అనే బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారాన్ని సోషల్‌ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌కి దృష్టికి తీసుకెళ్లారు.. నా అన్వేషణ ఫేం అన్వేష్.. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.. నా అన్వేష్‌ పోస్టు చేసిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ.. “బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత.. నిరాశలోకి నెట్టబడుతున్నారు.. నేను వందలాది హృదయ విదారక కథలను వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన కల్పించడం.. మరోవైపు బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడమే అన్నారు.. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై మేం కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాం అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

Read Also: PM Modi: ఎలాన్‌ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్‌.. ముచ్చటెందంటే!

అయితే, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేసిన అన్వేష్‌.. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, వెబ్‌సైట్స్‌లో ఈరోజు 16-4-2025 వరకు నడిపిస్తున్నారు, అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాల్సిందిగా.. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ.. గోవిందా బెట్టింగ్‌ యాప్‌పై తాను చేసిన వీడియోను కూడా అప్‌లోడ్‌ చేశాడు అన్వేష్‌.. ఇక, నా అన్వేషణ అన్వేష్‌ ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడమే మార్గం అని పేర్కొన్నారు..

Exit mobile version