Minister Nara Lokesh: దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ వరుసగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ.. పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు.. తాజాగా, టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్టాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో సమావేశం అయ్యారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. శరగవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో REIT మోడల్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయమన్నారు.. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని అడిగారు లోకేష్..
Read Also: World Economic Forum: దావోస్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్..
అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్ తో కలసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు మంత్రి లోకేష్.. విశాఖ, తిరుపతిలో సెమా టెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డాటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించమని కోరారు.. ఏపీలో మూడు అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని.. పవర్ ట్రాన్స్ మిషన్ ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఇక, రాబోయే మూడేళ్లలో భారత ఫైనాన్షియయల్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామన్నారు టెమాసిక్ హోల్డింగ్ హెడ్ లాంబా.. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు..