Site icon NTV Telugu

Minister Nara Lokesh: జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్‌ కౌంటర్..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: మెడికల్‌ కాలేజీల వ్యవహారం ఇప్పుడు ఏపీలో నేతల మధ్య పొలిటికల్‌ చిచ్చు పెడుతుంది.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. మేమేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదన్న ఆయన.. ఎందుకు ఈ ప్రభుత్త హయాంలో 5 ఏళ్లలో మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయలేదు..? అని ప్రశ్నించారు.. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్ అని.. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందన్నారు.. తెలియకపోతే.. పక్కన ఉన్న సలహాదారులని అడిగి తెలుసు కోవాలని సెటైర్లు వేశారు.. పీపీపీ అంటే ప్రైవేటేజేషన్‌ కాదు.. ఆ తేడా జగన్ తెలుసుకోవాలని సూచించారు.. పీపీపీ వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని స్పష్టం చేశారు మంత్రి లోకేష్…

Read Also: Telangana Lightning Tragedy: తెలంగాణలో దారుణం.. పిడుగు పాటుకు ఆరుగురు మృతి..

కాగా, మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు… నేనేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడు.. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ అయిపోదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీనే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన విషయం విదితమే. 17 కాలేజీలు ఉంటే.. ఒక్క కాలేజీ మాత్రమే పూర్తి అయింది. ఫౌండేషన్ వేయడం… రిబ్బన్ కట్ చేయడం… నేనేదో చేశానని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ కి రండి.. మెడికల్ కాలేజీలపై చర్చిద్దాం అంటూ వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే..

Exit mobile version