NTV Telugu Site icon

Nara Lokesh: టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేయండి..

Lokhesh

Lokhesh

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌లో వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు మంత్రి నారా లోకేష్‌.. టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్‌తో లోకేష్.. దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు… ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలన్నారు.. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటుచేయమని కోరారు లోకేష్.. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు.. స్థిరమైన సప్లయ్ చైన్ నిర్థారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీరజ్ కన్వర్ తెలిపారు.

Read Also: Donald Trump : అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో షాక్ తిన్న మెక్సికో షాక్.. ఇంతకీ మళ్లీ ఏమైందంటే ?

ఇక, కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం అన్నారు లోకేష్.. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA) ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలన్నారు లోకేష్.. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు.. ఏపీకి కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది..