Site icon NTV Telugu

Minister Atchannaidu: వైఎస్‌ జగన్‌కు అచ్చన్నాయుడు సవాల్‌.. చర్చకు సిద్ధమా..?

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

Minister Atchannaidu: అబద్ధాల‌కు అంబాసిడ‌ర్‌గా వైఎస్‌ జగన్ వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్‌ జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అబద్ధాలను బట్టబయలు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్‌ మాట్లాడే అర్హతే లేదని మంత్రి తేల్చిచెప్పారు. గత ప్రభుత్వంలో 1,674 కోట్లు దాన్యం బకాయిలు చెల్లించకుండా వదిలిపెట్టగా, కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించిందని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు గత ప్రభుత్వం ఇవ్వని పరిహారాలను కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే అందజేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మద్దతు ధరల కోసం రైతుల సంక్షేమార్థం 16 నెలల్లోనే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వివరించారు. వాస్తవాలపై బహిరంగ చర్చకు వైఎస్ జగన్ సిద్ధమైతే తాను ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు..

Read Also: Rahul Gandhi: “ఇన్‌సెక్యూరిటీ”.. పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version