NTV Telugu Site icon

Minister Nara Lokesh Birthday: ఏపీలో మంత్రి లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు.. చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్‌ విషెస్‌..

Nara Lokesh Birthday

Nara Lokesh Birthday

Minister Nara Lokesh Birthday: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్‌ పర్యటనలో ఉన్నారు లోకేష్‌.. బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లోకేష్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రియమైన లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు..

ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి, సోదరసమానులు లోకేష్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు, తెలుగుదేశం నేతలు..

మరోవైపు.. గుంటూరు నవభారత్ నగర్‌లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు తెలుగు తమ్ముళ్లు.. లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు తెలుగు యువత కార్యకర్తలు.. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరయ్యారు.. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి.. గుండ్లూరు అగస్తీశ్వర స్వామి గుడిలో రుద్రాభిషేకం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి.. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి.. కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జయ సూర్య.. ఇక, తిరుమలలో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అఖిలాండం వద్ద 516 కొబ్బరికాయలు కోట్టి మొక్కులు చెల్లించుకున్నారు అభిమానులు, స్థానికులు.. గుంటూరు లాడ్జి సెంటర్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరగగా.. హాజరై కేక్ కట్ చేసిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల.. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..