Site icon NTV Telugu

Bhogi 2026: దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు కొత్త వెలుగులు తేవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు..

Cbn

Cbn

Bhogi 2026: తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన.. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అన్నారు… ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని… అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version