AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యముగా కదిలి ఈరోజు ఉదయము 8.30 గంటలకు, 14.0డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.5డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు చెన్నైకి (తమిళనాడు) తూర్పు-ఈశాన్య 480 కి.మీ. దూరంలో.. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) యొక్క దక్షిణ-ఆగ్నేయముగా 430 కి.మీ. దూరంలో, గోపాల్పూర్ (ఒడిశా)కి దక్షిణ దిశలో 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.. ఈ వాయుగుండం నెమ్మదిగా తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ, దాని తీవ్రతను తదుపరి 12 గంటలపాటు కొనసాగి, ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది అని అంచనా వేసింది..
Read Also: Revanth Reddy On Rythu Bharosa: రైతు భరోసాపై సందేహాలు అవసరం లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణశాఖ.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందని.. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.. మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్టు కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడతాయని తెలిపింది.. ఇక, రాయలసీమలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తాజా బులెటిన్‌లో విడుదల చేశారు..