Site icon NTV Telugu

Vizag and Vijayawada Metro Rail: విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ టెండర్లలో కీలక పరిణామం..

Ap Metro Rail Md Ramakrishn

Ap Metro Rail Md Ramakrishn

Vizag and Vijayawada Metro Rail: విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి.. విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం ఇచ్చామని తెలిపారు.. గ‌రిష్టంగా 3 కంపెనీలు క‌లిసి జేవీగా టెండ‌ర్లు వేసుకునే అవ‌కాశం ఉందన్నారు.. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వ‌చ్చిన విన‌తిపై ఈ నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు.. దీనివ‌ల్ల ఎక్కువ కంపెనీలు టెండ‌ర్లలో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.. ప‌నుల‌ను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభ‌జించ‌డం వ‌ల్ల ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందన్నారు.. ఇత‌ర మెట్రో ప్రాజెక్ట్ ల అధ్యయ‌నం త‌ర్వాత ప‌నుల‌ను చిన్న ప్యాకేజీలుగా విభ‌జించ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు.. ఇక, రెండు ప్రాజెక్టులు రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు..

Read Also: Tamannaah : ఇన్నర్ వేర్ కనిపించేలా రెచ్చిపోయిన తమన్నా పై ఫ్యాన్స్ ఫైర్..

ఇక, ఫేజ్ -1 లో విశాఖ‌లో 46.23 కిలోమీటర్లు, విజ‌య‌వాడ‌లో 38 కిలో మీటర్ల మేర మెట్రో సివిల్ ప‌నుల‌కు అంత‌ర్జాతీయ టెండ‌ర్లు పిలిచాం.. విశాఖ మెట్రో టెండ‌ర్లకు అక్టోబ‌ర్ 10వ తేదీన, విజ‌య‌వాడ మెట్రో టెండ‌ర్లకు అక్టోబ‌ర్ 14వ తేదీన గడువు ముగుస్తుందని వెల్లడించారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి. కాగా, ముందస్తు బిడ్డింగ్‌ సమావేశంలో గుత్తేదారుల విజ్ఞప్తి మేరకు విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొదటి దశ పనులకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే.. విశాఖ మెట్రో టెండర్లు అక్టోబరు 7 వరకు, విజయవాడ మెట్రో 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 8న రాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. జాయింట్‌ వెంచర్‌ మోడల్‌లో పనులు చేసే అవకాశం కల్పించాలని, సింగిల్‌ ప్యాకేజీగా కాకుండా పనులు విభజించి టెండర్లు పిలవాలని విజ్ఞప్తులు రాగా… మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సింగిల్‌ ప్యాకేజీల కింద టెండర్లను ఆహ్వానించింది. అత్యధికులు దీనికి సానుకూలత వ్యక్తం చేయలేదు. పనుల విభజన చేస్తే ఎక్కువమంది టెండర్లు వేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో టెండర్లు వాయిదా వేశారు.. ఇప్పుడు విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం కల్పించారు..

Exit mobile version