AP: ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది.. అయితే.. ఇప్పటికీ వీజీ వెంకట రెడ్డి ఆచూకీ లభించలేదు.. వెంకట రెడ్డికి నోటీసులిచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.. వెంకట రెడ్డి ఆచూకీ కోసం మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ కూడా రాసింది.. తమకు వెంకట రెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది కోస్ట్ గార్డ్ సంస్థ. తమ వద్దకి వచ్చి జాయినవుతానని చెప్పారని.. రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకుండా జాయిన్ చేసుకోబోమని స్పష్టం చేసింది కోస్ట్ గార్డ్ సంస్థ.. ఇక, విచారణలో మరో అడుగు ముందుకేసిన అధికారులు.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వెంకటరెడ్డి భార్యకు నోటీసులు అందజేశారు.. కాగా, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా రూ.500 కోట్లకు ఎన్వోసీ ఇచ్చినట్టు వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.. ఉన్నతాధికారులకు చెప్పకుండా ఫైళ్లను ఆమోదించారట వీజీ వెంకట రెడ్డి.. దీంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వెంకట్‌రెడ్డిని ముందుగా సస్పెండ్ చేసింది.. ఆ తర్వాత విచారణ చేపట్టింది.. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు..
Read Also: Harish Rao : పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది