NTV Telugu Site icon

AP and Tamil Nadu: చేనేత వస్త్రాల అమ్మకాలు.. ఏపీ-తమిళనాడు మధ్య ఒప్పందం..

Ap Tn

Ap Tn

AP and Tamil Nadu: చేనేత వస్త్రాల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం కుదురింది.. ఆప్కో.. కో ఆప్టెక్స్ లలో రెండు రాష్ట్రాల చేనేత వస్త్రాలు అమ్ముకునేందుకు వీలుగా ఎంవోయూ కుదుర్చుకున్నారు.. ఈ ఏడాది 9 కోట్లకు పైగా వ్యాపార నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెండు రాష్ట్రాల మంత్రులు సవిత.. గాంధీ సమక్షంలో అధికారుల మధ్య ఒప్పందం జరిగింది.. అయితే, ఏపీలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించే లక్ష్యంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.. చేనేత కార్మికులకు 365 రోజుల పాటు పని కల్పిస్తూ వారు ఆర్థికంగా, సామాజికంగా గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ ను విస్తరించే పనిలో పడినట్టు పేర్కొన్నారు.. దీనిలో భాగంగా రాష్ట్రానికి ఆప్కోను తమళినాడుకు చెందిన కో ఆప్టెక్స్ తో ఎంవోయూ కుదుర్చుకున్నాయి..

Read Also: Ponguleti Sudhakar Reddy : మా శాయశక్తుల మీ సమస్య కోసం పోరాడుతాం