NTV Telugu Site icon

Andhra Pradesh: విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

Metro Rail Project

Metro Rail Project

Andhra Pradesh: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తంగా మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. వైజాగ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలోమీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గాను కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్ లోనూ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తం 76.9కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

Read Also: Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!

మరోవైపు.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. 66.15 కిలోమీట్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది.. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. ఇక, మొదటి ఫేజ్ లో 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయనుండగా.. రూ.11,009 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌.. పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచ పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతికి ఇలా మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టనున్నారు..

Show comments