NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: మంత్రులు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: మంత్రులు, ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ లక్ష్యాలు సహా వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తు్న్నారు.. కానీ, అలా కాకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా దానిలో కలిపించుకుంటే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.. మన ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది.. మంచి చేసేవారికి సపోర్ట్‌ ఉంటుంది.. ప్రజలకు మంచి చేయడానికే మన ప్రభుత్వం ఉందన్నారు.. ఇక, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు సూచించారు పవన్‌. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు.

Read Also: YS Jagan: ఓటమిపై మరోసారి జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇన్నిచేసినా ఎందుకు ఓడిపోయాం..?

ఇక, గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు అని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం కానీ.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించింది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు. రాళ్లు, రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలి’ అని అన్నారు. మరోవైపు.. మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది..? అని నిలదీశారు.. ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..