Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. తమ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఫోకస్ పెట్టారు.. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారట.. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలపై ప్రధానంగా ఈ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారట జనసేనాని.. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యం ఏ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉంది..? ఎవరు ఎక్కువ ఇసుక.. మద్యం.. ఇతర లావాదేవీల్లో ఉన్నారు..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలతో కూడిన సర్వే చేస్తున్నారట.. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలపై వరస విమర్శలు.. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ పరిణామాలపై సీరియస్‌గా ఉన్న పవన్ కల్యాణ్.. సర్వేకు ఆదేశాలు ఇచ్చారట.. అయితే, ఈ సర్వే ఆధారంగా.. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. దీంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్నర ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైనట్టుగా ప్రచారం సాగుతోంది..
Read Also: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
కాగా, గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో కీలకంగా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మూడు పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారని చెబుతుంటారు.. దాని కోసం కొన్ని స్థానాలను కూడా ఆయన త్యాగం చేశారట.. అయితే, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడమే కాక.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషిచేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. అయితే, ఏడాది తిరిగేలోపే పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
