NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్‌పై పవన్‌ సమీక్ష.. కీలక నిర్ణయం

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు.. ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వనున్నారు.. గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని.. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని.. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు..

Read Also: Jupally Krishna Rao : సంస్కారాన్ని నేర్పేది విద్య మాత్రమే

గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి, నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు ఆండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో.. తన క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌… ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Sankranthiki Vasthunam: ఆరు రోజుల్లో 100 కోట్ల షేర్

అయితే, ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై చర్చించారు.. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని, వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని ఉపముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటవుతుంది.. జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదించనున్నారు.