Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: సంతోషంగా ఉంది.. చిత్తూరు జిల్లా అధికారులను పవన్‌ కల్యాణ్‌ అభినందనలు..

Pawan Kalyan Amaravati

Pawan Kalyan Amaravati

Deputy CM Pawan Kalyan: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. చివరకు ఎమ్మెల్యేలు వస్తున్నా సరే.. అధికారులు హడావుడి చేస్తారు.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి సొంత డబ్బులతో అధికారులు బొకేలు, శాలువాలు.. ఇంకా రకరాల గిఫ్ట్‌లు ఇస్తుంటారు.. అయితే, వీటికి మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ దూరం.. ఇక, రోజు చిత్తూరు పర్యటనలో ఇవి ఏవీ లేకపోవడంపై సంతోషంగా వ్యక్తం చేశారు.. అంతేకాదు, చిత్తూరు జిల్లా అధికారులను అభినందించారు..

Read Also: Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏం చేయోచ్చో.. రెండేళ్ల‌లో చేసి చూపించాం

తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌… ఫ్రూట్ బాస్కెట్స్, జ్ఞాపికలు ఇస్తుంటారు. ఇవేవీ వద్దు అని కూడా చెబుతారు. వీటి కోసం ఉద్యోగులు సొంత డబ్బులు ఖర్చు చేయడమో, ప్రోటోకాల్ నిధులను వెచ్చించడమో చేస్తున్నారనీ.. ఈ తరహా మర్యాదలు, సత్కారాలు ఎవరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరికీ భారం కారాదన్నది ఉప ముఖ్యమంత్రి ఆలోచన.. అయితే, గురువారంనాటి తన పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలను చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు బొకేలు ఇవ్వడం , శాలువాలు కప్పడం వంటివి చేయలేదు. బొకేలు.. శాలువాలు హడావిడి లేనందుకు సంతోషంగా ఉందని చెబుతూ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అభినందించారు. అధికారులతోపాటు పార్టీ నేతలకు సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ బొకేలు, శాలువాలు లాంటివి వద్దు అని పలుమార్లు చెప్పారు. వాటికి చేసే ఖర్చు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించిన విషయం విదితమే..

Exit mobile version