AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert: ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రేపు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ తీవ్రవాయుగుండం ఛత్తీస్‌గఢ్–మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశముందని వెల్లడించింది. తీవ్రవాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాల వారీగా చూస్తే పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ఇక, గత 24 గంటల్లో అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడులో 67.2 మి.మీ., పెనమలూరులో 64.6 మి.మీ., అయినవిల్లిలో 62.8 మి.మీ., పోడూరులో 60.4 మి.మీ., పి.గన్నవరంలో 58 మి.మీ., కలిదిండిలో 55.6 మి.మీ., భీమవరంలో 52.6 మి.మీ., ముదినేపల్లిలో 52.4 మి.మీ., ముమ్మడివరంలో 50.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు..
ప్రజలు ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్న సమయంలో చిన్న పడవలతో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచిస్తూ, వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
-
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
-
Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?