Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు కాకినాడ జిల్లా, ఉప్పాడ తీర ప్రాంత మత్స్సకారుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కమిటీలో పరిశ్రమల, మత్స్య శాఖల కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఉంటారు. వీరితోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్ చే నామినేట్ అయ్యే మత్స్యకార వర్గానికి చెందిన సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ఈ కమిటీ కృషి చేయనుంది.. అయితే, మత్స్యకారుల సమస్యలపై తక్షణం స్పందించి కమిటీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Nidhhi Agerwal : నేరేడు పళ్ళు.. నిధి అగర్వాల్ కళ్ళు.. హాట్ ఫొటోస్
కాగా, కాలుష్య కారక పరిశ్రమలను మూసి వేయాలని, ఫార్మా కంపెనీల నుంచి విడుదల అవుతున్న వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపద దెబ్బతింటోందని రెండ్రోజులుగా మత్స్యకారులు ఆందోళనకు దిగడం.. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడం.. డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆయా సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు తెలపడం.. దీంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
