Site icon NTV Telugu

CM Chandrababu: సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఉదయం 9.54 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది.

Read Also: Heart Health: సైలెంట్ కిల్లర్స్.. యువతలో గుండెపోటుకు ఈ 6 ఆహారపు అలవాట్లే కారణమా?

అయితే, ఈ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించగా, భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు. G+7 భవనంతో పాటు మరో నాలుగు PEB భవనాలను సర్కార్ నిర్మించినట్లు పేర్కొన్నారు. సీఆర్డీయే, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేసింది. భవనం ప్రారంభానికి ముందు భూములు ఇచ్చిన రైతులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Exit mobile version