Site icon NTV Telugu

Chandrababu: ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు భేటీ.. 7 నెలల పాలనపై చర్చ

Apcm

Apcm

అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఎంపీలు, జోనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 7 నెలల పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. అలాగే పెట్టుబడులు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, మెంబర్ షిప్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజా స్పందన వంటి అంశాలపై నేతలతో చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ మీద దాడి.. సస్పెన్స్ థ్రిల్లర్ కి తక్కువేం కాదు.. ఈ లాజిక్స్ మిస్సయ్యాయే!

ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి ఎంపీలు పోరాటం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి పార్లమెంట్‌లో పోరాడాలని కోరారు. మంత్రులు, ఎంపీలు కలిసి సమన్వయంతో పని చేయాలని సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రేపు మైదుకూరుకు చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతిని కూడా మైదుకూరులోనే సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Mahindra BE 6: మహీంద్రాకు చెందిన కారు.. భద్రత విషయంలో తగ్గెదేలే!

Exit mobile version