NTV Telugu Site icon

Minister Narayana: 13 మందికి భూకేటాయింపులు రద్దు చేస్తున్నాం..

Narayana

Narayana

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూ కేటాయింపులపై సబ్ కమిటీలో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిపారు. ఈ సందర్భంగా పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఆ 13 సంస్థలకు కేటాయించిన భూములను క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే, గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. దీంతో పాటు మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.