APPSC: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. 2023 డిసెంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 12/2023కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. మొత్తం 89 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2023లో నోటిఫికేషన్ జారీ చేయగా, ఇందులో 87 పోస్టులకు తుది ఫలితాలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు 2 స్పోర్ట్స్ కోటా పోస్టుల ఫలితాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఎపీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను ఎపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ ద్వారా ఫలితాలను పరిశీలించుకోవచ్చని ఎపీపీఎస్సీ సూచించింది.
APPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
- గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలు విడుదల..
- గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించిన ఏపీపీఎస్సీ..

Appsc