Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Plans Integrated Strategic Material Hub Chandrababu Focus On Beach Sand Minerals

CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

Published Date :March 10, 2026 , 8:39 pm
By Sudhakar Ravula
  • ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ..
  • త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్..
  • వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..
CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్. . రూపకల్పన, పెట్టుబడులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధనే లక్ష్యం కావాలన్నారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్‌ పైనా మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. వనరుల సద్వినియోగం చేసుకోవాలంటే వాటిపై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు.

రాష్ట్ర తీరప్రాంతాల్లో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని అధికారులు తెలిపారు. వీటిలో ముఖ్యంగా.. ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి. ఈ ఖనిజాలు పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స పరికరాలు, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం మరియు అణు రియాక్టర్ భాగాల తయారీ వంటి కీలక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో లభిస్తున్న ఈ ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవడానికి మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!

– శ్రీకాకుళంలో టైటానియం పార్క్ – సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
– అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్ – సంవత్సరానికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
– మచిలీపట్నంలో సమగ్ర టైటానియం మరియు రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి పెద్ద ఊతం లభించడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh strategic material hub
  • AP beach sand minerals
  • AP industrial development
  • Chandrababu Naidu mining review
  • rare earth corridor Anakapalli

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions