Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్ నిజం కాదు.. APSDMA క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిందని.. ఇందులో అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా పేర్కొంది అంటూ సోషల్ మీడియాలో ఓ మ్యాప్ వైరల్‌గా మారింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలతో కూడిన కొత్త మ్యాప్ విడుదలైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు 06-04-2026న విడుదల చేసిన ప్రెస్ నోట్లో సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం అసత్యమని పేర్కొంది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
APSDMA ప్రకారం, తమ సంస్థ తరఫున ఎటువంటి కొత్త మ్యాప్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 28 జిల్లాల మ్యాప్ పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. APSDMA పేరు, లోగోను ఉపయోగించి షేర్ చేస్తున్న ఆ మ్యాప్‌కు ఎలాంటి ప్రామాణికత లేదని పేర్కొంది. ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు, మీడియా సంస్థలు నమ్మకూడదని, దానిని షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. అధికారికంగా సంస్థ విడుదల చేసే సమాచారం మరియు ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..