AP Municipality Reservations 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్ల పూర్తి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల అధికారం అక్టోబర్ 12, 2026న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ గెజిట్ అసాధారణ సంచిక నంబర్ 448లో ఈ నోటిఫికేషన్ ప్రచురితమైంది. Roc No.13023/9/2026/H1 ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, సంచాలకుడు పి. సంపత్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 106 చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో ఎస్టీలకు 3, ఎస్సీలకు 14, బీసీలకు 36 స్థానాలు కేటాయించారు. మహిళల సాధారణ కేటగిరీకి 27, రిజర్వేషన్ లేని సాధారణ కేటగిరీకి 26 స్థానాలు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు కలిపి కేటాయించిన రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా నిర్ణయించినట్లు నోటిఫికేషన్ వివరాలు పేర్కొంటున్నాయి.
ఎస్టీ రిజర్వేషన్లు: 3 స్థానాలు
ఎస్టీ వర్గానికి మొత్తం మూడు చైర్‌పర్సన్ పదవులు కేటాయించారు. వీటిలో రెండు సాధారణ కేటగిరీకి, ఒకటి మహిళకు రిజర్వ్ చేశారు.
* గూడూరు నగర పంచాయతీ – ఎస్టీ మహిళ
* అల్లూరు – ఎస్టీ సాధారణ
* ఆత్మకూరు (కర్నూలు జిల్లా) – ఎస్టీ సాధారణ
ఎస్సీ రిజర్వేషన్లు: 14 స్థానాలు
ఎస్సీ వర్గానికి మొత్తం 14 చైర్‌పర్సన్ పదవులు కేటాయించారు. వీటిలో ఏడు స్థానాలు ఎస్సీ మహిళలకు, మరో ఏడు స్థానాలు ఎస్సీ సాధారణ కేటగిరీకి కేటాయించారు.
ఎస్సీ మహిళలకు కేటాయించిన స్థానాలు:
* చింతలపూడి
* సూళ్లూరుపేట
* కొండపల్లి
* నిడదవోలు
* ఏలేశ్వరం
* గుత్తి
* చీరాల
ఎస్సీ సాధారణ కేటగిరీ స్థానాలు:
* ఉయ్యూరు
* సామర్లకోట
* పిఠాపురం
* నూజివీడు
* కుప్పం
* పొదిలి
* బాపట్ల
బీసీ రిజర్వేషన్లు: 36 స్థానాలు
బీసీ వర్గానికి మొత్తం 36 చైర్‌పర్సన్ పదవులు కేటాయించారు. ఇందులో 18 స్థానాలు బీసీ మహిళలకు, మరో 18 స్థానాలు బీసీ సాధారణ కేటగిరీకి కేటాయించారు.
బీసీ మహిళలకు కేటాయించిన 18 స్థానాలు:
* ఆళ్లగడ్డ
* సాలూరు
* ఇచ్ఛాపురం
* నర్సీపట్నం
* ఎర్రగుంట్ల
* జంగారెడ్డిగూడెం
* పాలకొండ
* తుని
* పాలకొల్లు
* కదిరి
* పుంగనూరు
* రాజంపేట
* గుడివాడ
* రాజాం
* గుంతకల్లు
* గూడూరు (కృష్ణా జిల్లా)
* నందికొట్కూరు
* ముమ్మిడివరం
బీసీ సాధారణ కేటగిరీకి కేటాయించిన 18 స్థానాలు:
* పిడుగురాళ్ల
* పుత్తూరు
* బేతంచర్ల
* రామచంద్రాపురం
* సత్తెనపల్లి
* శ్రీకాళహస్తి
* మదనపల్లె
* తాడిపత్రి
* తిరువూరు
* నంద్యాల
* హిందూపురం
* మడకశిర
* నెల్లిమర్ల
* పుట్టపర్తి
* పెనుకొండ
* రాయచోటి
* తాడిగడప
* బి. కొత్తకోట
మహిళల సాధారణ కేటగిరీ: 27 స్థానాలు
మహిళల సాధారణ కేటగిరీకి మొత్తం 27 చైర్‌పర్సన్ పదవులు కేటాయించారు. ఈ జాబితాలోని పట్టణాలు ఇవే:
* కనిగిరి
* కమలాపురం
* కొవ్వూరు
* వెంకటగిరి
* బుచ్చిరెడ్డిపాలెం
* యలమంచిలి
* కళ్యాణదుర్గం
* ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
* నరసాపురం
* పలాస కాశీబుగ్గ
* పెడన
* పలమనేరు
* జమ్మలమడుగు
* ఆకివీడు
* పొన్నూరు
* భీమవరం
* చిలకలూరిపేట
* జగ్గయ్యపేట
* ఆమదాలవలస
* మాచర్ల
* ఆదోని
* నాయుడుపేట
* ధోన్
* బొబ్బిలి
* రేపల్లె
* పార్వతీపురం
* పులివెందుల
రిజర్వేషన్ లేని సాధారణ కేటగిరీ: 26 స్థానాలు
రిజర్వేషన్ లేని సాధారణ కేటగిరీకి 26 చైర్‌పర్సన్ పదవులు కేటాయించారు. ఆ జాబితా ఇలా ఉంది:
* తణుకు
* తెనాలి
* గురజాల
* తాడేపల్లిగూడెం
* అమలాపురం
* ఎమ్మిగనూరు
* కావలి
* ప్రొద్దుటూరు
* నందిగామ
* కందుకూరు
* మండపేట
* దాచేపల్లి
* నగరి
* చీమకుర్తి
* రాయదుర్గం
* గిద్దలూరు
* వినుకొండ
* గొల్లప్రోలు
* అద్దంకి
* పెద్దాపురం
* ధర్మవరం
* బద్వేల్
* దర్శి
* మార్కాపురం
* మైదుకూరు
* నరసరావుపేట
మొత్తం రిజర్వేషన్ల వివరాలు
రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్ల విభజన ఇలా ఉంది:
* ఎస్టీ – 3 స్థానాలు
* ఎస్సీ – 14 స్థానాలు
* బీసీ – 36 స్థానాలు
* మహిళల సాధారణ కేటగిరీ – 27 స్థానాలు
* రిజర్వేషన్ లేని సాధారణ కేటగిరీ – 26 స్థానాలు
మొత్తం: 106 చైర్‌పర్సన్ పదవులు.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్-1, షెడ్యూల్-2 రూపంలో ప్రచురించారు. ఈ జాబితా రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ పార్టీల వ్యూహాలకు కీలకంగా మారనుంది.

