Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మంత్రులకు సింగపూర్‌లో ట్రైనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలనను బలోపేతం చేయడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరిపాలనలో ఆధునిక విధానాలు, ఆర్థిక వృద్ధి వ్యూహాలు, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలపై మంత్రులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మంత్రుల బృందం ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాలన, ఆర్థికాభివృద్ధి, నగరాభివృద్ధి, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై నిపుణుల నుంచి శిక్షణ పొందనున్నారు.
Read Also: IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల్లో నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సింగపూర్‌లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం, అక్కడ నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పాలనా వ్యవస్థలోని ఇతర విభాగాలకు అందించేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’ అమలులో భాగంగానే ఈ శిక్షణా పర్యటనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనను తీర్చిదిద్దడం, అంతర్జాతీయ ప్రమాణాల సేవలను అందించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!