AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Election: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.. అయితే, ఎన్నికల షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, వైరల్ అవుతున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారం ఫేక్ అని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని SEC సూచించారు. అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకముందే షెడ్యూల్ పేరుతో ప్రచారం చేస్తున్న సమాచారాన్ని నమ్మడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేయవద్దని హెచ్చరించారు.
అలాగే, ఎన్నికల సంఘం అధికారిక అనుమతి లేకుండా దాని పేరు, లోగోను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల సంఘం పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.. అయితే, తప్పుడు సమాచారం, అసత్య వార్తలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రజలు అప్రమత్తంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. “అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.. షేర్ చేయవద్దు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ప్రకటించారు SEC అనిల్‌చంద్ర పునేఠా..
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి