BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మరోవైపు వెనుకబడిన తరగతులకు శుభవార్త చెబుతూ.. రిజర్వేషన్ కోటాను పెంచింది ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో బీసీలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
జీవో ఎంఎస్ నంబర్ 105 ద్వారా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ 34 శాతం నుంచి 24.15 శాతానికి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ఇక, నగర పాలక సంస్థల్లోనూ బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లైంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్లు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!