Site icon NTV Telugu

AP Job Calendar 2026: రేపే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే..?

Ap Govt

Ap Govt

AP Job Calendar 2026: నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది.. ఏపీ జాబ్ క్యాలెండర్-2026 విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌.. రేపు ఏపీ జాబ్‌ క్యాలెండర్‌-2026ను అధికారికంగా విడుదల చేయనున్నారు. 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఉగాది శుభ సందర్భంగా ప్రకటించబోతోంది ఏపీ సర్కార్..

ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ 2026
మొత్తం ఖాళీలు: 10,060+

ఖాళీలు ఉన్న శాఖలు: 25 శాఖలు

ప్రధాన శాఖలు మరియు ఖాళీలు:

* స్కూల్ ఎడ్యుకేషన్ → 3,004 పోస్టులు
* హోమ్ (పోలీస్/ఫైర్) → 3,057 పోస్టులు
* హయ్యర్ ఎడ్యుకేషన్ → 1,500 ప్రొఫెసర్లు
* ప్రొహిబిషన్ & ఎక్సైజ్ → 452 పోస్టులు
* పంచాయతీ రాజ్ & RD → 328 పోస్టులు
* వాటర్ రిసోర్సెస్ → 224 AEE పోస్టులు
* ఫైనాన్స్ → 169 పోస్టులు
* అడవులు & పర్యావరణం → 140 పోస్టులు

Exit mobile version