AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP WhatsApp Services: ఇప్పటికే వాట్సాప్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా వైద్య సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే, వాట్సాప్‌లో “Hi” లేదా “హాయ్” అని మెసేజ్ పంపితే సరిపోతుంది. తరువాత వచ్చే మెనూలో ఆరోగ్య శాఖ ఆప్షన్‌ను ఎంచుకుని AMC సేవలను సులభంగా పొందవచ్చు.
ఈ కొత్త విధానం ద్వారా డాక్టర్ల రిజిస్ట్రేషన్ వివరాలు, వారి దరఖాస్తుల స్థితి వంటి కీలక సమాచారం ఇప్పుడు మొబైల్లోనే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, రాబోయే CME (Continuing Medical Education) కార్యక్రమాలు, క్రెడిట్ పాయింట్ల వివరాలు కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ప్రజలకు మరింత ఉపయోగకరంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఓపీ సేవలు, రక్త లభ్యతపై కూడా ఈ వాట్సాప్ సేవ ద్వారా సమాచారం పొందవచ్చు. అలాగే, ఆసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన సామగ్రి లభ్యతపై కూడా సులభంగా ఆరా తీసే అవకాశం కల్పించింది. ఈ విధంగా, వైద్యులు మరియు ప్రజలకు ఒకే వేదికపై అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, పౌరసేవలను మరింత సులభతరం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నిర్ణయం డిజిటల్ సేవల విస్తరణలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Also Read
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
- AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
-
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!