Site icon NTV Telugu

Nara Lokesh Warning: సోషల్‌ మీడియా పోస్టులపై నిఘా.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే అంతే..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh Warning: సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీలపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తాం అన్నారు లోకేష్.. ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించం అన్నారు.. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ ను అరికట్టాలని.. నిర్ణీత వయసు ఆధారిత సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలన్నారు.. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలన్నారు.. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదని.. అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ గా దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారన్నారు లోకేష్.. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించం అన్నారు…

Read Also: గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!

ఇక, ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు మంత్రి లోకేష్.. గతంలో జ్యుడీషియరీతో పాటు కొంత మందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారన్నారు.. విదేశాల్లో ఉండి అభ్యంతర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం అన్నారు లోకేష్.. ఇందు కోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్రప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు చేస్తే మా పార్టీ వాడైనా జైలుకు పంపించామని.. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు.. సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో కంటెంట్ స్ప్రెడ్ అవుతూందని ఫలితంగా వెనువెంటనే ప్రభావం చూపుతుందన్నారు.. కాంట్రవర్సీ ఎక్కువగా జనంలోకి వెళుతోందని.. ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలన్నారు.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాలని ఆస్ట్రేలియా, ఈయూ, యూకేలలో ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అమలు చేస్తూ హెవీ పెనాలిటీస్ విధిస్తున్నారని చెప్పారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version