AP Government: ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఇప్పటి మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28 కి పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా మార్కాపురం మరియు పోలవరం అనే రెండు జిల్లాలను అధికారికంగా ఆమోదించింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న 5 రెవెన్యూ డివిజన్లను కలిపితే మొత్తం సంఖ్య 82 కి చేరుకున్నాయి.. ఇక, కొత్త జిల్లాలకు కొత్తగా ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం..
Read Also: Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా ఎ.ఎస్. దినేష్ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ.ఎస్. దినేష్ కుమార్ ను పోలవరం జిల్లా ఇంఛార్జ్‌గా నియమించారు. ఇక, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్‌ను నియమించారు.. ప్రస్తుతం అల్లూరి జిల్లా SPగా ఉన్న అమిత్ బర్దర్‌ను పోలవరం జిల్లా SP (ఇంఛార్జ్) గా నియమించారు. జాయింట్ కలెక్టర్‌గా తిరుమాని శ్రీ పూజను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా JC గా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా JC గా నియమించారు.
ఇక, మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా పీ. రాజాబాబును నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్న పీ. రాజాబాబు ను మార్కాపురం జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు. మరోవైపు ఇంఛార్జ్ ఎస్పీగా వి. హర్షవర్థన్ రాజును ప్రకటించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా SPగా ఉన్న వి. హర్షవర్థన్ రాజును మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా నియమించారు. ఇక, జేసీగా రోనంకి గోపాల కృష్ణను నియమించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా JC గా ఉన్న రోనంకి గోపాల కృష్ణను మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ జేసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు..
