Deputy CM Pawan Kalyan: దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి వెళ్లిన ఆయన.. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు.. స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు.. ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై.. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు పవన్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్.. సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.. పంచ హారతులిచ్చారు.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు పవన్ కల్యాణ్..
Read Also: Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ షాక్.. కీవ్ నాటో సభ్యత్వం సాధ్యం కాదని వెల్లడి
ఇక, స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు పవన్.. ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.. స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి డిప్యూటీ కమిషనర్ ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు..