Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసింది.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.. అయితే, దీనిపై ఆనందం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచామని ఓ ప్రకటను పేర్కొన్నారు.

Read Also: Meenakshi Chaudhary : దాని కారణంగా అందరు నాకు దూరంగా ఉండేవారు..

మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ఎన్నికల హామీ కార్యరూపం దాల్చేలా చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.. వలసలు వెళ్తున్న మత్స్యకారులకు ఇక్కడే తగిన ఉపాధి చూపించే ఆలోచనలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అన్నారు.. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనది.. తీరం అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తామని తన ప్రకటనలో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version