AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. MSME పరిధిలో వచ్చే ఐదేళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ఆమోదించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించింది.. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీపై కూడా చర్చించారు..
Read Also: The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
ఇక, కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. పాఠశాల కిట్‌ల పంపిణీ కోసం రూ.944.53 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, వివిధ సంస్థల భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
