NTV Telugu Site icon

Rain Alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!

Rains

Rains

Rain Alert to Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే వర్షాలు.. వరదలతో అతలాకుతలం అవుతోంది.. ముఖ్యంగా విజయవాడ సిటీ.. పరసిర ప్రాంతాల్లో పరిస్థితి చిత్తడిగా మారిపోయింది.. వేలాది మంది బాధితులు.. ఆహారం, తాగునీటి కోసం వేచిచూడాల్సిన పరిస్థితి.. మరోవైపు.. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పుడిప్పుడే వర్షం నుంచి అంతా తేరుకుంటుండగా.. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదంటూ వాతావారణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మళ్లీ కలవర పెడుతున్నాయి..

Read Also: Post Card: కాస్త ఆలస్యమైన.. 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరిన ఉత్తరం..

ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు “ఆరేంజ్” బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది.. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ఇదే సమయంలో వరద ముంపు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ బులెటిన్ విడుదల చేశారు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు..

Show comments