AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

Rains

Rains

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నేడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.