CM Chandrababu Ayodhya Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రోజు అయోధ్యకు వెళ్లనున్నారు.. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ సముదాయంలో కొలువైన శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామ ఆలయంలో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.. 3 గంటలకు అయోధ్య నుంచి తిరిగి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.. నేరుగా విజయవాడకు చేరుకోనున్నారు..
Read Also: High Court: “కొడుకు”ను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని శిక్షించే చట్టాలు లేవు..
