Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ సందర్భంగా రహదారి నిర్మాణాన్ని నిలిపివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలి కాలంలో మెజారిటీ ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ దురుద్దేశాలతో దాఖలవుతున్నాయని పేర్కొంది. ఈ పిల్ కూడా నిజంగా సదుద్దేశంతోనే దాఖలైందా అనే అనుమానం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో ముందుకు ఏపీ.. సింగపూర్‌లో చంద్రబాబు కీలక ప్రసంగం
ఓఆర్ఆర్ ఎక్కడ నిర్మించాలనే అంశాన్ని ఒక వ్యవసాయదారుడు ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. అయితే, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే, కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
SSMB 30 : మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ30 ఎవరితో..?
-
Avor Electric Bike: భారత్‌లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!