NTR Statue in Amravati: అమరావతిలో NTR విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గర్వకారణం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది.. ఈ సమావేశానికి మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Also: Parakamani Case: పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది మనోభావాలు దెబ్బతీయడమే..!
సమావేశంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నమూనా విగ్రహాలను మంత్రులు పరిశీలించారు. డిజైన్, నిర్మాణం, కాన్సెప్ట్‌పై మంత్రుల మధ్య లోతైన చర్చ జరిగింది. విగ్రహం తుది రూపు ఖరారు, ఇతర అనుబంధ నిర్మాణాల రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని కూడా నియమించింది. అయితే, అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామంలోని కొండపై, నీరుకొండ రిజర్వాయర్ సమీపంలో ప్రభుత్వం భారీగా 3,500 టన్నుల కంచు (Bronze) విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది కేవలం విగ్రహమే కాకుండా తెలుగు జాతి వైభవం, తేజస్సు, సాహిత్య గొప్పతనాన్ని ప్రతిబింబించే స్మారకంగా నిలవనుంది అని మంత్రి నారాయణ తెలిపారు.
తెలుగు వైభవం – తెలుగు తేజం కాన్సెప్ట్
విగ్రహ నిర్మాణం “తెలుగు వైభవం – తెలుగు తేజం” అనే సాంస్కృతిక కాన్సెప్ట్‌తో జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. ఈ స్మారక ప్రాజెక్టులో భాగంగా.. ఎన్టీఆర్ మెమోరియల్ లైబ్రరీ, స్మృతి వనం, తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్రపై పరిశోధనకు కేంద్రంగా ఓ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని తెలిపారు. విగ్రహ ఏర్పాటు, అనుబంధ నిర్మాణాలపై ప్రజల అభిప్రాయం తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు AGICL పర్యవేక్షణలో కొనసాగుతోంది. తెలుగు సాహిత్యం పై దృష్టి పెట్టే విధంగా ఎన్టీఆర్ మేమోరియల్ లైబ్రరీ.. స్మృతి వనం… ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం అని వెల్లడించారు మంత్రి నారాయణ..
