Site icon NTV Telugu

Lightning: ప్రాణాలు తీస్తున్న పిడుగులు.. ఏపీలో ఐదేళ్లలో 570 మంది మృతి

Lightning

Lightning

Lightning: పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి.. అకాల వర్షాలు, వర్షాల సమయంలో.. వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తూనే ఉంది.. కానీ, వందలాది మంది ప్రాణాలను తీస్తూనే ఉన్నాయి పిడులు.. ఇక, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పిట్టలు.. ఎన్నో చనిపోతున్నాయో లెక్కలేని పరిస్థితి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ‌డిచిన ఐదేళ్లలో పిడుగుపాటు వ‌ల‌న 570 మంది మృతిచెందినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది..

Read Also: Test Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!

ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 570 మంది పిడుగుపాటుతో మృతిచెందగా.. అత్యధికంగా విజ‌య‌న‌గరంలో 56 మంది.. శ్రీ‌కాకుళంలో 45, ప‌ల్నాడులో 44, నెల్లూరులో 41 మంది చొప్పున పిడుగుపాటు వ‌ల‌న ప్రాణాలు కోల్పోయారు.. ఇక, అత్యల్పంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.. ఇక, 2018లో 137 మంది, 2019లో 80 మంది, 2019లో 75 మంది, 2020లో 80 మంది, 2021లో 52 మంది, 2022 మ‌రియు 2023లో 52 మంది చొప్పున‌, 2024లో 41 మంది, 2025లో ఇప్పటి వ‌ర‌కు 41 మంది వివిధ జిల్లాల్లో పిడుగు పాటుకు మృత్యువాతపడ్డారు.. పిడుగు పాటుతో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది రైతులు, ప‌శువుల కాప‌ర్లు, వ్యవసాయ కూలీలే ఉన్నారని వివరాలు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ..

Exit mobile version