Site icon NTV Telugu

High Tension In Paderu: సీఎం చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు!

Paderu

Paderu

High Tension In Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో సీఎం నిర్వహించే సభలో వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళుతున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజును పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు పైనే కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

Read Also: BJP: రాహుల్‌గాంధీ విందులో ఉద్ధవ్ థాక్రేకు అవమానం.. వెనుక సీటులో కూర్చోబెట్టారని బీజేపీ విమర్శ

ఇక, 1/70 చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. అలాగే, స్పెషల్ డీఎస్సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. దీంతో పాటు పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోని ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేయాలని ఈ మూడు ప్రధాన డిమాడ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మూడు డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి నిరసన చేస్తున్న వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Exit mobile version